నేటి చర్చ: చెంచుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహిళ ఫిర్యాదుతో వైద్యుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన చుంచుపల్లి పోలీసులు.
నేటి చర్చ: చెంచుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహిళ ఫిర్యాదుతో వైద్యుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన చుంచుపల్లి పోలీసులు.

నేటి చర్చ : చుంచుపల్లి , చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వైద్యం పేరుతో వేధింపులకు గురిచేశాడని ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డాక్టర్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడు కొత్తగూడెం విద్యానగర్ కాలనీ,బైపాస్ లోని శ్రీ కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. మహిళ ఫిర్యాదు మేరకు చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌లో Cr.No 114/2026గా భారతీయ న్యాయ సంహిత (BNS), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అక్టోబర్ 15వ తేదీ తెల్లవారుజామున విద్యానగర్ కాలనీ వద్ద నిందితుడిని అరెస్టు చేసి అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించడం జరిగింది.
