నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవ సంస్మరణ సభ పాల్గొన్న ఎస్పీ రోహిత్ రాజ్.

నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవ సంస్మరణ సభ పాల్గొన్న ఎస్పీ రోహిత్ రాజ్.
21 అక్టోబర్ 2026 న పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ అమరవీరుల సభ ఘనంగా నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులను స్మరిస్తూ వారి త్యాగం వృధా కాదని ఎప్పటికీ గుర్తుంటుందని తెలియజేశారు, పోలీసులు "శోక్ సస్త్ర" నిర్వహించి అమరవీరులకు గౌరవ వందనం చేశారు. అదేవిధంగా పోలీస్ అమరుల కొరకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగింది. పోలీస్ అమరవీరుల పేర్లను ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ చదివి వినిపించడం జరిగింది.
దేశ భద్రతలో, విధి నిర్వహణలో అమరులైన పోలీసులను తలుచుకుంటూ పోలీస్ అమరవీరుల సంస్మరణ సభను ఘనంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ నిర్వహించారు.
