నేటి చర్చ: భద్రాచలం, భద్రాచలం ఫుట్ బాల్ క్లబ్ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ ఫుట్ బాల్ టోర్నమెంట్.

నేటి చర్చ: భద్రాచలం, భద్రాచలం ఫుట్ బాల్ క్లబ్ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ ఫుట్ బాల్ టోర్నమెంట్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం: భద్రాచలం ఫుట్ బాల్ క్లబ్ (B.F.C) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి 7-A-Side ఫుట్ బాల్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లు క్లబ్ నిర్వాహకులు తెలిపారు.
నవంబర్ 7, 8 తేదీలలో భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ టోర్నమెంట్ ఘనంగా జరగనుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ప్రముఖ ఫుట్ బాల్ జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొననున్నాయి.
యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, ఫుట్ బాల్ క్రీడను ప్రోత్సహించడం ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు, ట్రోఫీలు అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా భద్రాచలం ఫుట్ బాల్ క్లబ్ ప్రెసిడెంట్ జకరయ్య, వైస్ ప్రెసిడెంట్ రవి, సెక్రెటరీ చందు, సలహాదారులు చలపతి, సలీం. మాట్లాడుతూ, భద్రాచలం ప్రాంతంలో ఫుట్ బాల్ క్రీడకు ఎంతో ఆదరణ ఉందని, ఇలాంటి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ల ద్వారా స్థానిక యువ క్రీడాకారులకు మంచి వేదిక లభిస్తుందని అన్నారు. టోర్నమెంట్ ను విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు.
టోర్నమెంట్ లో పాల్గొనదలచిన జట్లు తమ పేర్లను ముందుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
భద్రాచలం ఫుట్ బాల్ క్లబ్
ప్రెసిడెంట్: జకరయ్య
వైస్ ప్రెసిడెంట్: రవి
సెక్రెటరీ: చందు⁸సలహాదారులు: చలపతి, సలీం.
కమిటీ నెంబర్స్: మన్మధ, పప్పు ప్రసాద్, పవన్,హరీష్, నాగార్జున, ప్రసాద్, విక్కీ, గౌతమ్, మిక్కీ.
