నేటి చర్చ : హైదరాబాద్, షేర్‌ మార్కెట్‌లో రూ.35 లక్షల నష్టం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య.

షేర్‌ మార్కెట్‌లో రూ.35 లక్షల నష్టం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య పండగవేళ ఆనందంగా గడపాల్సిన కుటుంబంలో ఓ యువకుడి తొందరపాటు నిర్ణయం విషాదాన్ని నింపింది. షేర్‌మార్కెట్‌లో నష్టపోయి మనస్థాపంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చైతన్యపురి ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన మేరకు.. చైతన్యపురి సాయినగర్‌ కాలనీలో నివసించే రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి తమ్మిశేట్టి శ్రీనివాస్‌ కుమారుడు ప్రవీణ్‌ (34) సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

నేటి చర్చ : హైదరాబాద్,  షేర్‌ మార్కెట్‌లో రూ.35 లక్షల నష్టం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య.
Photo

నేటి చర్చ : హైదరాబాద్, షేర్‌ మార్కెట్‌లో రూ.35 లక్షల నష్టం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య.

షేర్‌ మార్కెట్‌లో రూ.35 లక్షల నష్టం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య పండగవేళ ఆనందంగా గడపాల్సిన కుటుంబంలో ఓ యువకుడి తొందరపాటు నిర్ణయం విషాదాన్ని నింపింది. షేర్‌మార్కెట్‌లో నష్టపోయి మనస్థాపంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చైతన్యపురి ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన మేరకు.. చైతన్యపురి సాయినగర్‌ కాలనీలో నివసించే రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి తమ్మిశేట్టి శ్రీనివాస్‌ కుమారుడు ప్రవీణ్‌ (34) సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి ప్రవీణ్‌ తీవ్రంగా నష్టపోయాడు. ఆదివారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ప్రవీణ్‌ రాత్రి వరకు తిరిగి రాకపోవటంతో చైతన్యపురి పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

పెట్రోల్‌ బంక్‌ సమీపంలో బిల్డింగ్‌ వద్ద మృతదేహం

చైతన్యపురి పెట్రోల్‌ బంక్‌ సమీపంలోని ఎయిర్‌టెల్‌ షోరూం బిల్డింగ్‌ వద్ద ఓ వ్యక్తి చనిపోయి ఉన్న విషయాన్ని స్థానికులు సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రవీణ్‌ మృతదేహంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడుల వల్ల సుమారు రూ.35 లక్షల వరకు నష్టపోయిన ప్రవీణ్‌ కుటుంబంలో, బంధువులలో పరువు పోతుందని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తెలిసిందని ఎస్‌ఐ తెలిపారు.

Latest News

Read More...
నేటి చర్చ : హసన్‌పర్తి, హనుమకొండ జిల్లా, పొలాలకు ట్యాంకర్లతో నీరు పారించిన ఫీల్డ్ సూపర్‌వైజర్ శ్యాంసుందర్ రెడ్డి సస్పెండ్.
నేటి చర్చ : హసన్‌పర్తి, హనుమకొండ జిల్లా, పొలాలకు ట్యాంకర్లతో నీరు పారించిన ఫీల్డ్ సూపర్‌వైజర్ శ్యాంసుందర్ రెడ్డి సస్పెండ్.

23-10-2026 11:16 pm

నేటి చర్చ : కర్ణాటక , పెళ్లయిన 6 నెలలకే భర్త హత్య.. ప్రియుడితో పారిపోయిన భార్య.
నేటి చర్చ : కర్ణాటక , పెళ్లయిన 6 నెలలకే భర్త హత్య.. ప్రియుడితో పారిపోయిన భార్య.

23-10-2026 06:47 pm

నేటి చర్చ : హసన్ పర్తి, హనుమకొండ జిల్లా, పంట ఎండిపోకుండా ట్యాంకర్లతో నీళ్లు పెడుతున్న రైతు.
నేటి చర్చ : హసన్ పర్తి, హనుమకొండ జిల్లా, పంట ఎండిపోకుండా ట్యాంకర్లతో నీళ్లు పెడుతున్న రైతు.

23-10-2026 06:33 pm

నేటి చర్చ : కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,కేంద్ర హోమ్ శాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలుపుతూ మొక్క నాటిన మొక్కల కె. ఎన్ రాజశేఖర్.
నేటి చర్చ : కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,కేంద్ర హోమ్ శాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలుపుతూ మొక్క నాటిన మొక్కల కె. ఎన్ రాజశేఖర్.

23-10-2026 06:22 pm

నేటి చర్చ : మెహబూబాబాద్ , మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఏరియా ఆసుపత్రిలో ప్రమాదం,పీడియాట్రిక్ వార్డులో ఊడిపోయిన సీలింగ్.
నేటి చర్చ : మెహబూబాబాద్ , మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఏరియా ఆసుపత్రిలో ప్రమాదం,పీడియాట్రిక్ వార్డులో ఊడిపోయిన సీలింగ్.

23-10-2026 05:01 pm