నేటి చర్చ : ఆంధ్ర ప్రదేశ్, తీరానికి దగ్గరగా అర్నబ్ తుఫాను.. ఈ 12 గంటలు చాలా ముఖ్యం అని అధికారుల మాట.

నేటి చర్చ : ఆంధ్ర ప్రదేశ్, తీరానికి దగ్గరగా అర్నబ్ తుఫాను.. ఈ 12 గంటలు చాలా ముఖ్యం అని అధికారుల మాట.
అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ అతి తీవ్ర అర్ణబ్ తుఫాన్.. విశాఖపట్నం, బాపట్ల మధ్య యానాం దగ్గర్లో బుధవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతోపాటు అతి వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. తుఫాన్ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పలు రైళ్లను సైతం రద్దు చేశారు.
శ్రీకాకుళం నుంచి ప.గో. జిల్లా వరకు భారీ వర్షాలు.. చంద్రబాబు
బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ అతి తీవ్ర తుఫానుగా మారింది. ఇది బుధవారం ఉదయం విశాఖ-బాపట్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన అన్ని జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో తుఫాను ఎదుర్కోవాల్సిన కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
