తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు , రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.
నేటి చర్చ : హైదరాబాద్, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదనే కారణంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు తెలంగాణ హైకోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అలాగే రూ.2,000 జరిమానా విధిస్తూ జస్టిస్ కె. లక్ష్మణ్ కీలక తీర్పు వెలువరించారు.
అయితే కలెక్టర్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తూ జైలు శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేసింది.
కేసు వివరాలు:
1. రంగారెడ్డి జిల్లాలోని కొన్ని భూములను రిజిస్ట్రేషన్ల నిషేధిత జాబితా (Section 22-A) నుంచి తొలగించాలని బాధితులు అధికారులను కోరారు.
2. 2025 ఆగస్టులో హైకోర్టు బాధితుల వినతిని 60 రోజుల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించింది.
3. అయినప్పటికీ నిర్ణీత గడువులో ఆదేశాలను అమలు చేయకపోవడంతో బాధితులు 2025 అక్టోబర్ 15న కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
4. కోర్టు ధిక్కరణ కేసు దాఖలైన తర్వాతే కలెక్టర్ నోటీసులు జారీ చేసి, 2026 ఫిబ్రవరి 26న వినతిని తిరస్కరించారు. అనంతరం జూలై 8న మరోసారి తిరస్కరణ ఉత్తర్వులు ఇచ్చారు.
5. ఈ వ్యవహారంలో కలెక్టర్ వివరణ సంతృప్తికరంగా లేదని, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని హైకోర్టు పేర్కొంది.
"హైకోర్టు విధించిన శిక్ష"
ఆరు నెలల సాధారణ జైలు శిక్ష.
రూ.2,000 జరిమానా.
శిక్ష అమలుపై నాలుగు వారాల తాత్కాలిక నిలుపుదల.
