అనుబోస్ కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం,అల్లుడు మృతి.. అత్తకు తీవ్ర గాయాలు ,మరో వ్యక్తి పరిస్థితి విషమం.
Views :0

అనుబోస్ కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం,అల్లుడు మృతి.. అత్తకు తీవ్ర గాయాలు ,మరో వ్యక్తి పరిస్థితి విషమం.
నేటి చర్చ : పాల్వంచ, పాల్వంచ సమీపంలోని అనుబోస్ కాలేజ్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా,ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
వివరాల ప్రకారం,పాల్వంచ నుంచి దేవుజా తండా వైపు వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనం,కిన్నెరసాని వైపు నుంచి పాల్వంచకు వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్న అత్త–అల్లుళ్లలో అల్లుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. అత్తకు తీవ్ర గాయాలు కాగా,ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనదారుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.
