నేటి చర్చ: కొత్తగూడెం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రతీ పాఠశాలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సందర్శించాలి - రేగా

నేటి చర్చ: కొత్తగూడెం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రతీ పాఠశాలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సందర్శించాలి - రేగా
నేడు తేదీ: 23-10-2026 (శుక్రవారం) రోజున జిల్లాలోని పాఠశాలలు తిరిగి పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో, అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధులకు తప్పనిసరిగా హాజరయ్యే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
భద్రాద్రి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు సర్పంచ్ /మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ పరిధిలో ఉన్న అన్ని ప్రాథమిక పాఠశాలలను సందర్శించి, ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం ఇప్పటికే ఓటు నమోదు చేసుకున్నారా లేదా అనేది తెలుసుకోవాలి. నమోదు చేసుకోని అర్హులైన ఉపాధ్యాయులకు ఫారం-18 అందించి, ఓటరు నమోదుకు అవసరమైన వివరాలను తెలియజేయాలి.
అదేవిధంగా, స్థానిక మండల నాయకులు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, సహకారసంఘాల అధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్స్ ఇతర ముఖ్య నాయకులు సమన్వయం చేసుకొని తమ మండల పరిధిలోని జిల్లా పరిషత్ / ఆశ్రమ /ప్రయివేట్ ఉన్నత పాఠశాలలను సందర్శించి, అర్హులైన ఉపాధ్యాయులకు ఫారం-18 అందజేసి ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి.
పూర్తి చేసిన ఫారం-18తో పాటు ఓటరు నమోదుకు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలను జతచేసి, తేదీ 24-10-2026న మనకు తిరిగి అందజేయాలని ఉపాధ్యాయులకు ముందుగానే తెలియజేయాలి.మన పార్టీ నాయకులు మళ్ళీ తిరిగి కలెక్ట్ చేసుకొని ఓటరుగా నమోదు చేపించాలి.
ఈ కార్యక్రమాన్ని మాజీ MLA నియోజకవర్గ ఇంచార్జిలు /నియోజకవర్గ సభ్యత్వ నమోదు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిలు బాధ్యతగా తీసుకొని, అర్హులైన గ్రాడ్యుయేట్లు ఎవరూ ఓటు హక్కును కోల్పోకుండా సమన్వయంతో పనిచేయాలి. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఈ ఓటరు నమోదు ప్రక్రియ ఎంతో కీలకం కావున, పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను.
నోట్: ఫామ్ 18 PDF ఈ కింద ఉన్నది.. ప్రింట్ తీసుకొని పాఠశాలలకు వెళ్లాల్సిందిగా కోరుచున్నాను.
