తెలంగాణ NHM ఉద్యోగుల ఐక్యత ఆధ్వర్యంలో రిలే దీక్షలు – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

Views :0
తెలంగాణ NHM ఉద్యోగుల ఐక్యత ఆధ్వర్యంలో రిలే దీక్షలు – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
NHM JAC Relay strike

తెలంగాణ NHM ఉద్యోగుల ఐక్యత ఆధ్వర్యంలో రిలే దీక్షలు – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

వేదిక: ధర్నా చౌక్, IDOC పక్కన, నవభారత్ | తేదీ: 27.10.2026 నుండి జరుగుతున్న ధర్నా| సమయం: 10 AM to 04 PM

గౌరవనీయులైన తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నమస్కారం,

మేము గత 20 సంవత్సరాలుగా 78 కేడర్లలో 17,541 మంది NHM కుటుంబంగా పనిచేస్తున్నాము. మేము కేవలం NHM పథకాలకే కాదు, ప్రభుత్వం అప్పగించిన ప్రతి కార్యక్రమంలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేశాము. ముఖ్యంగా *కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి* రాత్రింబవళ్లు కష్టపడి జిల్లాల్లో లక్షలాది మంది ప్రాణాలను, దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలను కాపాడాము. కోవిడ్ టెస్టింగ్, వ్యాక్సినేషన్, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, సర్వేలు, ఫీల్డ్ విజిట్స్, మెడికల్ క్యాంపులు, ట్రైనింగ్స్, బస్తీ దవాఖాన, పల్లె దవాఖాన, ఆరోగ్య మహిళా వంటి అన్ని సేవల్లో ముందుండి నిలిచాము.

యూనిఫాంలో తేడా లేదు, డ్యూటీ టైమింగ్స్‌లో తేడా లేదు, బాధ్యతల్లో తేడా లేదు.కానీ జీతం, ఉద్యోగ భద్రత, సౌకర్యాలు, గుర్తింపులో మాత్రం *ఆకాశానికి - భూమికి ఉన్నంత తేడా ఉంది.ఈ అన్యాయం ఇక పరిష్కరించాలి, మా హక్కులు మాకు దక్కాలి.

హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో NHM ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. స్వరాష్ట్రంలో RTC, VRA, MEPMA లకు న్యాయం చేసినట్లే, మాకు కూడా న్యాయం చేయాలి.

మా న్యాయమైన డిమాండ్లు:

NHM ఉద్యోగుల క్రమబద్ధీకరణ: 78 కేడర్ల NHM ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. దీనివల్ల ప్రభుత్వానికి అదనపు ఆర్థిక భారం ఉండదు.

క్రమబద్ధీకరణ అయ్యేంతవరకు ఈ న్యాయమైన డిమాండ్స్ ని అమలు చేయాలి

వేతన సవరణ: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తూ, ప్రతి కేడర్‌కు ఫిక్సేషన్ చేసి 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలి. GO 1195 వల్ల తగ్గిన వేతనాలను సవరించి, అన్ని కేడర్లకు న్యాయం చేస్తూ, పెంచిన జీతాలు ఎటువంటి మార్పు లేకుండా నూతన GO అమలు చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్ లోకి మార్చకుండా, అందరినీ State Health Society (SHS)లోనే కొనసాగించి నేరుగా జీతాలు చెల్లించాలి.

జీతం - ఇంక్రిమెంట్: ప్రతి నెల 1వ తేదీన (కనీసం 5వ తేదీలోపు) జీతం విడుదల చేయాలి. పెండింగ్‌లో ఉన్న 5% ఇంక్రిమెంట్ + 8% లాయల్టీ బోనస్ తక్షణమే ఇవ్వాలి.

భద్రతా పథకాలు: ఉద్యోగులందరికీ EHS (Employee Health Scheme) & GPAIS (Group Personal Accident Insurance Scheme) వర్తింపజేయాలి.

మహిళా ఉద్యోగులకు: కేడర్‌తో సంబంధం లేకుండా 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి.

కుటుంబానికి అండ: విధుల్లో ఉద్యోగి మరణిస్తే, కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్-గ్రేషియా + అర్హత కలిగిన కుటుంబ సభ్యునికి కారుణ్య ఉద్యోగం ఇవ్వాలి.

మేము కోరేది భిక్ష కాదు, 20 ఏళ్లుగా సమానంగా సేవ చేసి, కోట్లాది ప్రాణాలు కాపాడినందుకు హక్కు.

మా నినాదం: సమాన పనికి సమాన వేతనం - NHM ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి!

జై తెలంగాణ! జై NHM!

NHM Employees భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (17,541 NHM Family - 78 Cadres United)

Latest News

Read More...
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు , రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు , రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.

09-11-2026 07:30 pm

రూ.2 లక్షల లంచం తీసుకంటూ. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.
రూ.2 లక్షల లంచం తీసుకంటూ. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.

09-11-2026 05:32 pm

భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో ప్రమాదకరంగా భారీ గుంత.. అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఎప్పుడు వీడుతుంది?
భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో ప్రమాదకరంగా భారీ గుంత.. అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఎప్పుడు వీడుతుంది?

09-11-2026 02:25 pm

చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో అగ్నిప్రమాదం,కాలిపోయిన డాక్యుమెంట్లు.
చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో అగ్నిప్రమాదం,కాలిపోయిన డాక్యుమెంట్లు.

09-11-2026 01:08 pm

ఇల్లందు,వేపల గడ్డ తండాలో కలకలం. వ్యక్తి అనుమానాస్పద మృతి.
ఇల్లందు,వేపల గడ్డ తండాలో కలకలం. వ్యక్తి అనుమానాస్పద మృతి.

09-11-2026 12:41 pm