మంచిర్యాల రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి, క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

Views :0
మంచిర్యాల రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి, క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్,అర్ధరాత్రి మంచిర్యాల రైల్వే స్టేషన్ పరిసరాల్లో సీపీ ఆకస్మిక తనిఖీలు.

నేటి చర్చ : రామగుండం, 9 నవంబర్, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి మంచిర్యాల రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి, క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్‌తో కలిసి రైల్వే స్టేషన్ పరిసరాలను సందర్శించిన సీపీ, రైల్వే సిబ్బంది, దుకాణాల యజమానులు, ప్రయాణికులతో భద్రతా పరిస్థితులపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా స్థానిక పోలీసులు చేపడుతున్న రాత్రి పెట్రోలింగ్,నిఘా చర్యలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పర్యవేక్షణను పరిశీలించారు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దుకాణాలు,ఇతర వ్యాపార సంస్థలు నిర్ణీత సమయపాలన పాటిస్తున్నాయా లేదా అనే అంశాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.

రాత్రి వేళల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పోలీస్ నిఘా కొనసాగించాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీల్లో మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు పాల్గొన్నారు.

Latest News

Read More...
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు , రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు , రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.

09-11-2026 07:30 pm

రూ.2 లక్షల లంచం తీసుకంటూ. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.
రూ.2 లక్షల లంచం తీసుకంటూ. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.

09-11-2026 05:32 pm

భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో ప్రమాదకరంగా భారీ గుంత.. అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఎప్పుడు వీడుతుంది?
భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో ప్రమాదకరంగా భారీ గుంత.. అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఎప్పుడు వీడుతుంది?

09-11-2026 02:25 pm

చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో అగ్నిప్రమాదం,కాలిపోయిన డాక్యుమెంట్లు.
చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో అగ్నిప్రమాదం,కాలిపోయిన డాక్యుమెంట్లు.

09-11-2026 01:08 pm

ఇల్లందు,వేపల గడ్డ తండాలో కలకలం. వ్యక్తి అనుమానాస్పద మృతి.
ఇల్లందు,వేపల గడ్డ తండాలో కలకలం. వ్యక్తి అనుమానాస్పద మృతి.

09-11-2026 12:41 pm