మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త.
Views :0

మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త.
నేటి చర్చ : సంగారెడ్డి జిల్లా, కోహీర్ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త జైపాల్, భాగ్య (28) దంపతులు కాగా.. మద్యం మత్తులో భర్త ఆమెను కొట్టి చంపాడు. కర్రతో తల, ముఖంపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆమెను కోహీర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటన అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. భాగ్యమ్మకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు.
