రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

రుద్రంపూర్‌లో వైభవంగా కార్తీక పౌర్ణమి మహోత్సవం.
నేటి చర్చ – రుద్రంపూర్, నవంబర్ 24:
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రుద్రంపూర్‌లోని శ్రీ రుద్ర లింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆలయ ప్రాంగణంలో జ్యోతులను వెలిగిస్తూ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపారు.
ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలో శివలింగం ఆకారంలో దీపాలను వెలిగించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
అదేవిధంగా ఉసిరి దీపాలు, 365 వత్తులతో దీపాలను వెలిగించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయం దీపకాంతులతో శోభాయమానంగా మారింది. భక్తుల శివనామస్మరణలు, దీపాల వెలుగులతో ఆలయ పరిసరాలు భక్తిమయంగా మారాయి.
ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
హర హర మహాదేవ! ఓం నమః శివాయ!
