మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
Views :0

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
నేటి చర్చ : ములుగు జిల్లా, 24 నవంబర్, మల్లంపల్లి మండల కేంద్రంలో మహిళపై హత్యాయత్నం ఘటన కలకలం రేపింది. బత్తిని లక్ష్మి అనే మహిళ ఇంట్లోకి చొరబడిన దుమాల రాజేష్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లక్ష్మిని చికిత్స నిమిత్తం ఎన్ఎస్ఆర్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
అత్త పై దాడికి పాల్పడిన దుమాల రాజేష్ ములుగు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. ఈ ఘటనతో మల్లంపల్లి ప్రాంతంలో ఆందోళన నెలకొంది.
భార్యపై అనుమానం ఆస్తి వివాదాలు.
