ఐ వి ఎఫ్ సెంటర్లు,66 మంది మహిళల నుంచి అండాల సేకరణ, ముఠా గుట్టు రట్టు.

ఐ వి ఎఫ్ సెంటర్లు,66 మంది మహిళల నుంచి అండాల సేకరణ, ముఠా గుట్టు రట్టు.
నేటి చర్చ : హైదరాబాద్, 13 నవంబర్,ఈ ముఠా సుమారు 66 మంది మహిళల నుంచి అండాలను సేకరించినట్లు అధికారులు గుర్తించారు. అయితే వారిలో 19 మందికి సంబంధించిన రికార్డులు పూర్తిగా మాయం చేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
అంతేకాకుండా, సరైన అనుమతులు లేని గచ్చిబౌలి, ఉప్పల్, మలక్‌పేట, టోలీచౌకి ప్రాంతాల్లోని క్లినిక్‌లకు సేకరించిన అండాలను సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ అక్రమ నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తొమ్మిది మంది ఏజెంట్ల కోసం పోలీసుల గాలింపు.
ఈ వ్యవహారంపై పోలీసులు BNS, ART (Assisted Reproductive Technology) చట్టాల కింద Cr.No.426/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అమిత్ శర్మ, నిఖత్ శర్మ, దీపిక సహా మొత్తం తొమ్మిది మంది ఏజెంట్లు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
మహిళల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ, వైద్య రంగం పేరుతో అక్రమ వ్యాపారాలు సాగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించకూడదనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ దందాలో బాధ్యులందరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధిత మహిళలకు అవసరమైన వైద్య పరీక్షలు, ఆరోగ్య పరిరక్షణ, న్యాయ సహాయం అందించాల్సిన అవసరం ఉంది.
