గొడ్రాలు అంటూ వేధింపులు. భర్తను కత్తితో నరికి చంపిన భార్య.

గొడ్రాలు అంటూ వేధింపులు, భర్తను కత్తితో నరికి చంపిన భార్య.
సంతానం కలగలేదని నిత్యం అవమానిస్తూ, మద్యం మత్తులో వేధిస్తున్న భర్తపై భార్య కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది.
నేటి చర్చ : బెంగళూరు, 13 నవంబర్, బెంగళూరులోని కెంపేగౌడనగర్ పరిధి లక్ష్మీపురలో రాజశేఖర్ (32), మాలాశ్రీ (30) దంపతులు నివసిస్తున్నారు. రాజశేఖర్ ఓ బ్యాంకులో రుణాల మంజూరు విభాగంలో పనిచేస్తున్నాడు. వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో భార్యను తరచూ 'గొడ్రాలు' అంటూ దూషిస్తూ, మద్యం తాగి వచ్చి వేధించేవాడని సమాచారం.
ఈ క్రమంలో బుధవారం రాత్రి మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన మాలాశ్రీ వంటగదిలోని కత్తి తీసుకొచ్చి భర్తపై విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మాలాశ్రీని అరెస్టు చేసి, హత్యకు గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
