రాజస్థాన్‌లో రైల్వే ట్రాక్‌పై పేలుడు.. ఉగ్రకుట్ర కోణంలో దర్యాప్తు.

Views :0
రాజస్థాన్‌లో రైల్వే ట్రాక్‌పై పేలుడు.. ఉగ్రకుట్ర కోణంలో దర్యాప్తు.
Bomb blast on railway track

రాజస్థాన్‌లో రైల్వే ట్రాక్‌పై పేలుడు.. ఉగ్రకుట్ర కోణంలో దర్యాప్తు.

భారత్–పాక్ సరిహద్దు సమీపంలో కలకలం.. పలు రైళ్లు రద్దు!

నేటి చర్చ : రాజస్థాన్, భారత్–పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని శ్రీగంగానగర్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. సూరత్‌గఢ్‌–అనూప్‌గఢ్‌ రైల్వే మార్గంలో గుర్తుతెలియని దుండగులు పేలుడు పదార్థాలతో ట్రాక్‌ను ధ్వంసం చేసినట్లు సమాచారం.

ఈ పేలుడు ధాటికి పట్టాల కింద ఉన్న సిమెంట్‌ దిమ్మెలు (స్లీపర్లు) ధ్వంసమయ్యాయి. ట్రాక్‌ సమీపంలో భారీ గొయ్యి ఏర్పడింది. ఘటన నేపథ్యంలో అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు.

సంఘటనపై ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) సహా పలు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. పేలుడు వెనుక ఉగ్రవాదుల కుట్ర ఉందా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

సరిహద్దు ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై పేలుడు జరగడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm