బెంగళూరులో దారుణ ఘటన,అక్రమ సంబంధం పెట్టుకుందని భార్య, ఆమె ఆరుగురు కుటుంబ సభ్యులను కిరాతకంగా హతమార్చిన క్యాబ్ డ్రైవర్.

బెంగళూరులో దారుణ ఘటన,అక్రమ సంబంధం పెట్టుకుందని భార్య, ఆమె ఆరుగురు కుటుంబ సభ్యులను కిరాతకంగా హతమార్చిన క్యాబ్ డ్రైవర్.
నేటి చర్చ : బెంగళూరు, బెంగళూరులోని రాజాజీనగర్ పరిధిలోని భాష్యం సర్కిల్‌లో అక్టోబర్ 16వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య తన భార్యతో సహా ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురిని హత్య చేసిన అర్జున్ ఇందుశేఖర్ (52) అనే క్యాబ్ డ్రైవర్
మొదట తన భార్య సునీత (40)ను హత్య చేసి, ఆమెను వెతుక్కుంటూ వచ్చిన ఆమె తల్లి రూపవతి (65)ను కూడా హతమార్చిన నిందితుడు
తన భార్య, ఆమె తల్లి టూర్‌కు వెళ్లారని చెప్పి, భార్య సోదరులు శివకుమార్ (30), శంకర్ (44), వారి భార్యలు దివ్య (30), నళిని (29)లను ఇంటికి పిలిచి మద్యం తాగించి అందరినీ హతమార్చిన కిరాతకుడు
వారితో పాటు శివకుమార్ కొడుకు పునీత్ (7)ను కూడా హతమార్చినట్టు గుర్తింపు
ఈ ఘటనలో ఇందుశేఖర్ కూతురు (మైనర్ బాలిక) కూడా రక్తపు మరకలు కడిగేందుకు అతనికి సహకరించినట్టు సమాచారం
అయితే శంకర్, నళినిల 11 ఏళ్ల కొడుకును చంపకపోవడంతో తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టి రాయితో కొట్టి చంపి మృతదేహాలను గోనె సంచుల్లో పెట్టి కారులో తీసుకెళ్లి పడేసినట్టు పోలీసులకు తెలిపిన బాలుడు
నంది హిల్స్‌తో పాటు ఇతర దూర ప్రాంతాల్లో మృతదేహాలను పడేసిన నిందితుడు
తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుని తనను బెదిరించేదని, అందుకే హత్య చేశానని విచారణలో పోలీసులకు తెలిపిన ఇందుశేఖర్
