తమిళనాడులో భారీ చోరీ, రూ.50 కోట్ల విలువైన బంగారు నగలు మాయం.
Views :0

తమిళనాడులో భారీ చోరీ, రూ.50 కోట్ల విలువైన బంగారు నగలు మాయం.
నేటి చర్చ : తమిళనాడు, మధురైలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. నగరంలోని ప్రముఖ *తనిష్క్ గోల్డ్ షోరూమ్* లో సుమారు రూ.50 కోట్ల విలువైన బంగారు నగలు అపహరణకు గురైనట్లు సమాచారం.
షోరూమ్ షట్టర్‌ను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై షోరూమ్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. దొంగల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
