అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్, ప్రయాణికులంతా సురక్షితం.
Views :0

అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్, ప్రయాణికులంతా సురక్షితం.
నేటి చర్చ : అస్సాంలోని కామ్రూప్ మెట్రో జిల్లా దిగారు రైల్వే స్టేషన్ వద్ద బుధవారం ఉదయం కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు.
- ప్రమాదంలో ఇంజిన్‌తో పాటు ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.
- లోకో పైలట్ రైలు వేగాన్ని నియంత్రించలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
- ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ రైలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
