వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్, కొత్త PUC నిబంధనలు విడుదల, ఇక BS-VI వాహనాలకు మూడేళ్ల వరకు పొల్యూషన్ సర్టిఫికెట్ గడువు.
Views :0

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. కొత్త PUC నిబంధనలు విడుదల.. ఇక BS-VI వాహనాలకు మూడేళ్ల వరకు పొల్యూషన్ సర్టిఫికెట్ గడువు.
నేటి చర్చ : ఢిల్లీ, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నవంబర్ 13, 2026న కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. నవంబర్ 19న ఈ వివరాలు వెల్లడయ్యాయి.
పాత PUC సర్టిఫికెట్లకు కొత్త గడువు వాటి మొదటి రెన్యువల్ సమయంలో వర్తిస్తుంది.
గడువు ముగియడానికి 10 రోజుల ముందు రెన్యువల్ చేస్తే పాత సర్టిఫికెట్ గడువు ముగిసిన తేదీ నుంచి కొత్తది అమలవుతుంది.
గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ చేస్తే రెన్యువల్ చేసిన తేదీ నుంచి కొత్త సర్టిఫికెట్ అమలవుతుంది.
ముఖ్య గమనిక: కొత్త నిబంధనలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా వర్తించే కేంద్ర నిబంధనలు.
