పతకాలు గెలిచిన క్రీడాకారులకు చెక్కులు ఇచ్చారు నగదు మరిచారు.

పతకాలు గెలిచిన క్రీడాకారులకు చెక్కులు ఇచ్చారు నగదు మరిచారు.
నేటి చర్చ : హైదరాబాద్, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించినా దక్కని ఉద్యోగం. ఆసియా క్రీడలు, ప్రపంచ, ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధిస్తే తమను కనీసం గౌరవించరా అంటూ క్రీడాకారుల ఆవేదన
అధికారుల సమన్వయ లోపంతో హామీలు ఇచ్చినా అమలు కావడం లేదని ఆగ్రహం
ప్రపంచ స్థాయిలో గతేడాది పతకాలు సాధించిన క్రీడాకారులకు గచ్చిబౌలి స్టేడియంలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష సమక్షంలో చెక్కులు ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
బధిర షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు రూ.2.10 కోట్లు
పారా అథ్లెట్ జీవాంజి దీప్తికి రూ.50 లక్షలు
షూటర్ తనిష్‌కు రూ.53.65 లక్షలు
బాక్సర్ నిఖత్ జరీన్‌కు రూ.60 లక్షలు
షూటర్ ఇషా సింగ్‌కు రూ.3.25 కోట్ల చెక్కులని పంపిణీ చేసిన రేవంత్ రెడ్డి
వీరితో పాటు అథ్లెట్ అగసర నందినికి రూ.25 లక్షలు, ఆర్చర్ చికితకు రూ.75 లక్షల నగదు ప్రోత్సాహకాలు ఇప్పటివరకు అందలేదని క్రీడాకారుల ఆవేదన
అలాగే ఇషా సింగ్‌కు గ్రూప్-1 ఉద్యోగం, పారా అథ్లెట్ దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం ఇస్తామని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించినా ఇంకా దక్కని ఫలితం.
సీఎంవో, ఆర్థికశాఖతో కలిసి పని చేయాల్సిన శాట్ వైఫల్యమే తమ పాలిట శాపంగా మారిందని విమర్శిస్తున్న క్రీడాకారులు.
