మురసు తుపాన్ వరద నీటిలో ఖమ్మం జిల్లాకు చెందిన 11 మంది పోలీసులు గల్లంతయ్యారు అని తెలుస్తుంది.?

మురసు తుపాన్ వరద నీటిలో ఖమ్మం జిల్లాకు చెందిన 11 మంది పోలీసులు గల్లంతయ్యారు అని తెలుస్తుంది.?
నేటి చర్చ : సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు వద్ద చిక్కుకుపోయిన మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన పోలీసులు వరద నీటీలో బోటు తిరగబడి గల్లంతైనట్లు ప్రాథమిక సమాచారం.
వరదనీటిలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు చాతకొండ 6వ బెటాలియన్ కు చెందిన SDRF కు చెందిన పోలీసులు బేతుపల్లి చెరువులోకి రెండు బోట్లలో వెళ్లారు. అయితే పోలీసులు ప్రయాణిస్తున్న రెండు బోట్లు నీటి ఉధృతికి తిరగబడడంతో 11 మంది పోలీసులు గల్లంతైనట్లు సమాచారం. బేతుపల్లి చెరువు నీటి నుంచి తమ్మిలేరు వాగులోకి పోలీసులు గల్లంతైనట్లు తెలుస్తోంది.
అయితే గల్లంతైనవారు ఈతలో నిష్ణాతులని, వారివద్ద లైఫ్ జాకెట్లు కూడా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వరదనీటిలో గల్లంతైన పోలీసులు సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుందాం.
