ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిని బలిగొన్న ఆర్టీసీ బస్సు,9 ఏళ్ల బాలుడు మృతి.

ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిని బలిగొన్న ఆర్టీసీ బస్సు,9 ఏళ్ల బాలుడు మృతి.
నేటి చర్చ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, జిల్లా లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ మండలం మొతుగూడ గ్రామంలో జాతీయ రహదారిపై ఉన్న సర్వీస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో చౌదరి వర్షిత్ (9) అనే ఐదో తరగతి విద్యార్థి మృతి చెందాడు.
మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్‌కు వస్తున్న ఆసిఫాబాద్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు (TS20 T 8538) ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని ఢీకొట్టినట్లు సమాచారం.
బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చిన్నారి మృతితో మొతుగూడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి.
అప్పటివరకు ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అంతలోనే విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
