ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,జాతీయ ప్రయోజనాలే రాజకీయాలకు ప్రథమ ప్రాధాన్యం – డా. పెసరు విజయచంద్ర రెడ్డి


ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,జాతీయ ప్రయోజనాలే రాజకీయాలకు ప్రథమ ప్రాధాన్యం – డా. పెసరు విజయచంద్ర రెడ్డి
నేటి చర్చ : , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 13 నవంబర్, కొత్తగూడెం లొ
ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ప్రేక్షకుల్లా చూస్తూ మౌనంగా ఉండటం పౌరుల బాధ్యత కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ విలువలను, దేశ సమగ్రతను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై ముందుకు రావాలని ఈరోజు కొత్తగూడెంలోని సూర్యా ప్యాలెస్ లో సిటిజన్ ఫర్ డెమోక్రసీ కన్వీనర్ ప్రముఖ న్యాయవాది కాసాని రమేష్ గారి అధ్యక్షతన జరిగిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం-అరాచక శక్తులను తరిమికొడదాం మేధావుల సంగోస్టి కార్యక్రమంలో దక్షిణ భారత ఆర్థోపెడిక్ అసోసియేషన్ అధ్యక్షులు, హన్మకొండ జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ డా. పెసరు విజయచంద్ర రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా డా. విజయచంద్ర రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం అంటే ఐదేళ్లకోసారి ఓటు వేయడం మాత్రమే కాదని, నిరంతరం ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వాల జవాబుదారీతనం, స్వేచ్ఛాయుత చర్చలు, రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగడమే నిజమైన ప్రజాస్వామ్యమని వివరించారు. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ న్యాయవాది బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ జాతీయవాదం అనేది కేవలం రాజకీయ నినాదం కాదని, దేశం పట్ల ప్రేమ, బాధ్యత, అంకితభావం, జాతీయ ఐక్యతకు కట్టుబడి ఉండటమే నిజమైన జాతీయవాదమని అన్నారు. భారతదేశంలోని భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలను కలిపి ఉంచేది భారతీయత అనే భావన అని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి SIR గురించి తప్పుడు ప్రచారం చేస్తుందని sir వలన భారతదేశంలో నిజమైన పౌరుల ఓటు ఎవరిది పోలోదని కేవలం అక్రమ వలసదారుల ఓట్లు మరణించిన వారి ఓట్లు ఒక వ్యక్తికి రెండు వేర్వేరు చోట్ల రెండు ఓట్లు ఉంటే అటు ఓట్లు మాత్రమే ఎన్నికల కమిషన్ తొలగించిందే తప్ప నిజమైన పౌరుడు యొక్క ఓటు తొలగించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఇండియా కూటమి అక్రమ వలసదారులు కూడా ఓటు ఇవ్వాలి అని అనడం హాస్యస్పదమని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ రిటైర్డ్ ఉపాధ్యాయులు పార్థసారథి, నేషనల్ డస్ట్ ప్రివెన్షన్ కమిటీ సభ్యులు పి. మాధవ్ నాయక్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, న్యాయవాదులు, వైద్యులు, విద్యావేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, కార్మిక సంఘాల నాయకులు, కుల సంఘాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
