కోరుట్లలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు.
Views :0

కోరుట్లలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు.
నేటి చర్చ : కోరుట్ల మండలం, 14 నవంబర్, మాదాపూర్ గ్రామ శివారులో కోరుట్ల నుంచి మాదాపూర్‌కు బైక్‌పై వెళ్తున్న దొంకేశ్వరి ప్రశాంత్ (24), గడ్డం నవీన్‌ల వాహనాన్ని ఎదురుగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందగా, నవీన్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. సమీపంలోని పొలాల్లో వరి కొయ్యలు కాల్చడంతో ఏర్పడిన పొగ రహదారిని కమ్ముకోవడం వల్ల ఎదురుగా వస్తున్న వాహనం కనిపించక ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఘటనతో మాదాపూర్‌లో విషాదం నెలకొంది.
