రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆర్మీ వాహనం, పలువురు సైనికులకు గాయాలు.
Views :0

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆర్మీ వాహనం, పలువురు సైనికులకు గాయాలు.
నేటి చర్చ : రంగారెడ్డి జిల్లా, 13 నవంబర్, చేవెళ్ల మండలం, అల్లావాడ గేట్ సమీపంలో ఆర్మీ వాహనం బోల్తా పడిన ఘటనలో పలువురు సైనికులు గాయపడ్డారు.
గోల్కొండ ఆర్మీ క్యాంపు నుంచి శిక్షణ నిమిత్తం షాబాద్ మండలానికి 14 మంది సైనికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి పలుమార్లు బోల్తా పడింది. అనంతరం చెట్టును ఢీకొని ఆగిపోయింది.
ఈ ప్రమాదంలో 8 మంది సైనికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో గోల్కొండలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
