అర్ధరాత్రి ఏటీఎంలో చోరీకి యత్నం, సీసీ కెమెర చోరీ- గంటల వ్యవదిలో నే నిందితుడిని పట్టుకున్న కామారెడ్డి పోలీసులు

Views :0
అర్ధరాత్రి ఏటీఎంలో చోరీకి యత్నం, సీసీ కెమెర చోరీ- గంటల వ్యవదిలో నే నిందితుడిని పట్టుకున్న కామారెడ్డి పోలీసులు

నేటి చర్చ: కామారెడ్డి జిల్లా,

అర్ధరాత్రి ఏటీఎంలో చోరీకి యత్నం, సీసీ కెమెర చోరీ- గంటల వ్యవదిలో నే నిందితుడిని పట్టుకున్న కామారెడ్డి పోలీసులు

• జేపీఎన్ రోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎంలో నగదు చోరీకి యత్నం.

• గుర్తుపట్టకుండా ఉండేందుకు ముందుగానే సీసీ కెమెరాల చోరీ.

• ఇనుప రాడ్‌తో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు దొంగిలించే ప్రయత్నం.

• భద్రతా అలారం మోగడంతో పరారీ.

• నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్, చోరీ చేసిన సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్ స్వాధీనం.

కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు.

తేది 11.11.2026న రాత్రి సుమారు 1 గంట సమయంలో కామారెడ్డి పట్టణంలోని జేపీఎన్ రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలోకి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించాడు. ముందుగా తనను ఎవరూ గుర్తించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏటీఎం కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తొలగించినాడు తర్వాత తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి అందులోని నగదును దొంగిలించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమములో ఏటీఎం భద్రతా నిఘా వ్యవస్థ ద్వారా అలారం మోగడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, కామారెడ్డి డీఎస్పీ శ్రీ ఎస్. మధుసూదన్ గారి పర్యవేక్షణలో, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ శ్రీ నరహరి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టాయి. దర్యాప్తులో భాగంగా పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సమాచారం మేరకు కామారెడ్డి పట్టణంలోని బ్యాండ్ షాపులో పనిచేస్తున్న వ్యక్తి నిందితుడిగా గుర్తించారు.

కేసు వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రలోని పర్భణి జిల్లాకు చెందిన మహేష్ జ్ఞానోబా బిందే (33), కామారెడ్డిలోని వాల్మీకి బ్యాండ్ షాప్ యందు బ్యాండ్ వాయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను, ఒక వ్యక్తి వద్ద తీసుకున్న రూ.10 వేల అప్పు తీర్చడానికి ఏటీఎం లోని నగదు చోరీకి పథకం వేశాడు. 11వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇనుప రాడ్‌తో ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ముందుగా అక్కడున్న సీసీ కెమెరాలను తొలగించి తన వెంట తీసుకెళ్లాడు. అనంతరం ఏటీఎం యంత్రాన్ని పగలగొట్టి నగదు దోచుకునేందుకు ప్రయత్నించగా, ఒక్కసారిగా సెక్యూరిటీ అలారం మోగడంతో భయపడిపోయి డబ్బు తీసుకోకుండానే అక్కడి నుంచి పరారయ్యాడు. నేరం అనంతరం పోలీసులకు అనుమానం రాకుండా కామారెడ్డిలోనే ఉండిపోయిన నిందితుడిని గుర్తించి తన గ్రామానికి పారిపోయేందుకు రైల్వే స్టేషన్‌కు వద్దకు వెళ్ళగా గంటల వ్యవదిలోనే కామారెడ్డి పట్టణ పోలీసులు పాటుకున్నారు.

నిందితుడి వివరాలు: మహేష్ జ్ఞానోబా బిందే (33) నివాసం: పర్భణి జిల్లా, మహారాష్ట్ర, ప్రస్తుత నివాసం: వాల్మీకి బ్యాండ్ షాపు, కామారెడ్డి పట్టణం.

నిందితుడి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులు:

1.నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్ 2. ఏటీఎం కేంద్రం నుండి తొలగించి ఎత్తుకెళ్లిన సీసీ కెమెరాలు. 3. మొబైల్ ఫోన్

నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు యందు ప్రవేశపెట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా విధులు నిర్వహించిన కానిస్టేబుల్ నర్సింలు, హోంగార్డు మోహన్ రెడ్డిలను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm