ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం - విదేశీ శక్తుల కుట్రలను తిప్పికొడదాం, బండి విజయ్ భాస్కర్.

Views :0
ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం - విదేశీ శక్తుల కుట్రలను తిప్పికొడదాం, బండి విజయ్ భాస్కర్.
Nationalist Bandi Vijaya Bhaskar

ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం - విదేశీ శక్తుల కుట్రలను తిప్పికొడదాం, బండి విజయ్ భాస్కర్.

సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో మేధావులతో సంగోష్ఠి!

నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 13 నవంబర్, కొత్తగూడెం సూర్య ప్యాలెస్ లో ఈరోజు సాయంత్రం సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో "మేధావులతో సంగోష్ఠి - A Dialogue With Eminent Citizens" ఘనంగా జరిగింది.

ఈ సమావేశంలో ప్రధానంగా SIR పై జరుగుతున్న ఉద్యమాల వెనకాల ఉన్న అసలు నిజాలు బయటపెట్టారు.

SIR వెనక - విదేశీ శక్తుల హస్తం!

ఈ సందర్భంగా కొత్తగూడెం జాతీయవాది *బండి విజయభాస్కర్* గారు మాట్లాడుతూ - సంచలన విషయాలు వెల్లడించారు.

SIR పై జరుగుతున్న ఉద్యమాలు - అమాయకంగా జరుగుతున్నవి కావు! వీటి వెనకాల జార్జ్ సోరోస్, ప్రోగ్రెసివ్ అలయన్స్, ఎలాన్ మస్క్ లాంటి వారి పరోక్ష ప్రమేయం ఉందని ఆయన స్పష్టంగా చెప్పారు.

విదేశీ డబ్బుతో, విదేశీ ప్రోత్బలంతో - భారతదేశంలో అస్థిరత సృష్టించాలని కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు.

మోడీ అడ్డుగా నిలబడ్డారు - అందుకే ఈ కుట్ర!

అమెరికా - భారతదేశంలో బలవంతంగా తమ వ్యవసాయ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని చూస్తే - ప్రధాని నరేంద్ర మోడీ గారు అడ్డుగా నిలబడ్డారు!

మన రైతులను కాపాడటం కోసం - మోడీ గారు అమెరికాకు తలొగ్గలేదు!

అదేవిధంగా - రష్యా నుంచి పెట్రోల్ ని కొనవద్దని అమెరికా చెప్పినా - వినకుండా - మన దేశ ప్రయోజనాల కోసం రష్యా నుంచి పెట్రోల్ కొన్నారు!

దీనివల్ల దేశాన్ని స్థిరపరచాలని, మోడీ గారిని దెబ్బతీయాలని - విదేశీ శక్తుల ప్రోత్బలంతో ఈ ఉద్యమాలు జరుగుతున్నాయని బండి విజయభాస్కర్ గారు వివరించారు.

జాతీయవాదుల పైనే బాధ్యత!

ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత జాతీయవాదుల పైనే ఉందని ఆయన పిలుపునిచ్చారు.

ప్రజల మధ్యకు వెళ్ళి - జాతీయవాదులు చర్చ పెట్టి - ప్రతి వాస్తవాన్ని తెలియజేయాలని - ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆయన కోరారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం - అరాచక శక్తులను తరిమికొడదాం - అనే నినాదంతో ఈ సమావేశం ముగిసింది.

Latest News

Read More...
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm

హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.
హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.

24-11-2026 05:04 pm