ఉస్మానియా వద్ద ఉద్రిక్తత, ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన

ఉస్మానియా వద్ద ఉద్రిక్తత, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినుల ఆందోళన.
- నాణ్యత లేని కల్తీ ఆహారం పెడుతున్నారంటూ అర్ధరాత్రి నిరసన
- విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం యూనివర్సిటీ యాజమాన్యం బాధ్యత కాదా?
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్ విద్యార్థినులు రాత్రి వేళ నిరసనకు దిగారు. హాస్టల్‌లో నాణ్యత లేని, కల్తీ ఆహారం అందిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు.
హాస్టల్‌లో భోజన నాణ్యతపై పలుమార్లు సమస్యలు ఎదురవుతున్నాయని, విద్యార్థినుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మెరుగైన హాస్టల్‌లో భోజన నాణ్యతపై పలుమార్లు సమస్యలు ఎదురవుతున్నాయని, విద్యార్థినుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మెరుగైన ఆహారం అందించాలని వారు డిమాండ్ చేశారు.ఆహారం అందించాలని వారు డిమాండ్ చేశారు.
విద్యార్థినుల సమస్యలను యూనివర్సిటీ అధికారులు వెంటనే పరిష్కరించాలని, హాస్టల్‌లో ఆహార నాణ్యతను తనిఖీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
