హైదరాబాద్‌లో నీటి కొరత.. విద్యాసంస్థలకు సెలవులు.. మెట్రో స్టేషన్లలో విద్యార్థుల రద్దీ.

హైదరాబాద్‌లో నీటి కొరత.. విద్యాసంస్థలకు సెలవులు.. మెట్రో స్టేషన్లలో విద్యార్థుల రద్దీ.
నేటి చర్చ : హైదరాబాద్, 3 నవంబర్, హైదరాబాద్‌లో నీటి కొరత ప్రభావం విద్యాసంస్థలపై కూడా పడింది. మాదాపూర్, హైటెక్స్ ప్రాంతాల్లోని శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల బ్రాంచ్‌లలో నీటి కొరత ఏర్పడటంతో యాజమాన్యాలు విద్యార్థులకు సెలవులు ప్రకటించినట్లు సమాచారం.
దీంతో ఒక్కసారిగా వేలాది మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు బయటకు రావడంతో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ విద్యార్థులతో కిక్కిరిసిపోయింది.
ఒకవైపు అభివృద్ధి అంటూ గొప్పలు చెప్పుకోవడం.. మరోవైపు విద్యాసంస్థలకు కనీసం నీటి సరఫరా కూడా అందకపోవడం ఏమిటి?
ప్రజలకు కనీస మౌలిక సదుపాయమైన తాగునీటిని అందించడంలో పాలకుల వైఫల్యంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
అభివృద్ధి అంటే ఆర్భాటాలు కాదు.. ప్రజలకు కనీస అవసరాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి అని ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
