పాకిస్థాన్‌పై భారత్ సంచలన విజయం,భారత ఆటగాళ్ల మాస్ సెలబ్రేషన్స్.

పాకిస్థాన్‌పై భారత్ సంచలన విజయం,భారత ఆటగాళ్ల మాస్ సెలబ్రేషన్స్.
నేటి చర్చ : ఒమన్‌లో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత యువ జట్టు ఉత్కంఠభరిత విజయం సాధించింది.
2026 నవంబర్ 14న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చివరి బంతికి ఒక వికెట్ తేడాతో గెలిచి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది.
భారత ఆటగాళ్ల సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే..
చివరి బంతికి బౌండరీ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించిన మోహిత్ ఉల్వాను సహచర ఆటగాళ్లు చుట్టుముట్టి సంబరాలు చేసుకున్నారు.
మోహిత్‌ను త్రివర్ణ పతాకంతో చుట్టి అభినందించారు.
కొందరు భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్ల ముందే ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా సహాయక సిబ్బంది ఆటగాళ్లను అదుపు చేశారు.
మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోలేదు. స్కోర్ వివరాలు :
పాకిస్తాన్ : 337/9
భారత్ : 339/9
మోహిత్ ఉల్వా 26 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. మనల్ చౌహాన్ 47 పరుగులు చేశాడు.
