కల్లుగీత కార్మిక ఉద్యమ నేత దేశిని చిన్న మల్లయ్య గౌడ్ 9వ వర్ధంతి సభకు ఘన ఏర్పాట్లు.

కల్లుగీత కార్మిక ఉద్యమ నేత దేశిని చిన్న మల్లయ్య గౌడ్ 9వ వర్ధంతి సభకు ఘన ఏర్పాట్లు.
•పెద్దపల్లిలో బుధవారం నిర్వహణ.. రాష్ట్ర, జిల్లా స్థాయి కల్లుగీత కార్మిక సంఘం నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధుల హాజరు
నేటి చర్చ : పెద్దపల్లి, నవంబర్ 10,
కల్లుగీత కార్మికుల హక్కుల సాధన, సంక్షేమం, సామాజిక అభ్యున్నతి కోసం విశేష కృషి చేసిన ఉద్యమ నేత దేశిని చిన్న మల్లయ్య గౌడ్ 9వ వర్ధంతి సభను బుధవారం (నవంబర్ 11) పెద్దపల్లిలో ఘనంగా నిర్వహించనున్నారు. కల్లుగీత కార్మిక సంఘం (KGKS) ఆధ్వర్యంలో పట్టణంలోని కునారం రోడ్డులో గల నందన గార్డెన్స్‌లో ఉదయం 10 గంటలకు ఈ వర్ధంతి సభ జరగనుంది. ఇందుకు సంబంధించి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ వర్ధంతి సభకు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సర్వాయి పాపన్న కల్లుగీత కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సింగం సత్యయ్య గౌడ్, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు, గౌడ సంఘం జాతీయ నాయకుడు, మాజీ ఎంపీపీ మల్యాల రాంచంద్రం గౌడ్, మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గోపగోని సారయ్య గౌడ్, ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.
అదేవిధంగా సర్వాయి పాపన్న కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి పరశురాములు గౌడ్, సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాగిరి అంజి గౌడ్, సిద్దిపేట జిల్లా కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు కోపాడ కొమురయ్య గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోని సాంబయ్య గౌడ్, గౌడ సంఘం నాయకుడు మంద రమేష్ గౌడ్, మంచిర్యాల కార్పొరేటర్ ముఖేష్ గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం నాయకుడు పెద్దంపేట శంకర్ గౌడ్, కరీంనగర్ జిల్లా కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి గౌడ్ తదితరులు హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా దేశిని చిన్న మల్లయ్య కల్లుగీత కార్మికుల హక్కుల కోసం చేసిన పోరాటాలు, సంఘ నిర్మాణానికి అందించిన సేవలు, కార్మికుల సంక్షేమం కోసం సాగించిన ఉద్యమాలను నాయకులు స్మరించుకోనున్నారు. గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కుల పరిరక్షణ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి చేపట్టాల్సిన చర్యలపై సభలో చర్చించనున్నారు.
కావున పెద్దపల్లి జిల్లా గీత కార్మికులు, గౌడ బాంధవులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై దేశిని చిన్న మల్లయ్య వర్ధంతి సభను విజయవంతం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం (KGKS) నాయకులు విజ్ఞప్తి చేశారు.
