శోదా కంపెనీలో OB కార్మికులకు కనీసవేతనాలు, చట్టబద్ధ హక్కులు,సౌకర్యాలను అమలుచేయాలి-మేయర్ మూడ్ గణేష్, సిపిఐ జిల్లా సెక్రటరీ షాబీర్ పాషా.

Views :0
 వీకే సీఎం  లో మట్టి వెలికితీత పనులు నిర్వహిస్తున్న శోదా కంపెనీలో OB కార్మికులకు కనీసవేతనాలు, చట్టబద్ధ హక్కులు,సౌకర్యాలను అమలుచేయాలి-మేయర్ మూడ్ గణేష్, సిపిఐ జిల్లా సెక్రటరీ షాబీర్ పాషా.

సింగరేణి కొత్తగూడెం ఏరియా లోని వీకే సీఎం లో మట్టి వెలికితీత పనులు నిర్వహిస్తున్న శోదా కంపెనీలో OB కార్మికులకు కనీసవేతనాలు, చట్టబద్ధ హక్కులు,సౌకర్యాలను అమలుచేయాలి.

కార్మికులపై బెదిరింపు,రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలి.

సింగరేణి,కార్మికఅధికారులు స్పందించి చట్టాలను అమలు చేయించాలి.

కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా.

నేటి చర్చ : సింగరేణి, 15 నవంబర్, కొత్తగూడెం వికేసిఎంలో శోదా కంపెనీ 2025 ఆగస్టులో OB తొలగింపు పనులు ప్రారంభించింది.సోదా కంపెనీలో కార్మికులకు కనీస వేతనాలు,చట్టబద్ధ సౌకర్యాలు,హక్కులను అమలుచేయాలని గత 16 నెలలుగా అన్ని కార్మిక సంఘాల జేఎసి డిమాండ్ చేస్తున్నా శోదా యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోలేదు.2026జూలై నాటికి సం.రo దాటినందున 20 శాతం బోనస్ ఇవ్వాలని జేఎసి గత మూడు నెలలుగా విజ్ఞప్తి చేస్తున్నా మొండిగానే

యాజమాన్యం ఉంది.బోనస్,సమస్యల పరిష్కారానికి కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు నవంబర్ 8 నుండి ఆందోళన జరుగుతుంది.శోదా కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు కనీసవేతనాలు,చట్టబద్ధ హక్కులు సౌకర్యాలను అమలుకు కార్మిక సంఘాలతో

చర్చించి సామరస్యంగా పరిష్కరించుకోని పారిశ్రామిక శాంతిని కాపాడేందుకు ముందుకు రావాల్సిన శోదా కంపెనీ యాజమాన్యం ప్రభుత్వ అండదండలు చూసుకొని కార్మికచట్టాలు,కోల్ మైన్స్ నియమ నిబంధనలు ఖాతరుచేయకుండా కార్మికులపై రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. అని అన్నారు కార్మికులను బయటపెట్టి ఆందోళనను అణిచివేయా లనే ఉద్దేశంతో ఒకవైపున కార్మిక సంఘాల జేఏసీతో చర్చలు జరుగుతున్న క్రమంలో నవంబర్ 10న రెండో షిప్ట్ కార్మికులు విధులు నిర్వర్తిస్తుంటే కార్మికుల వద్దకు సోదా యాజమాన్యం వెళ్లి మీరు పనులు నిర్వర్తించాల్సిన అవసరం లేదు వాహనాలను పక్కకు ఆపి పనులు బంధు పెట్టండి అని సోదా యాజమాన్యమే పనులు బందు పెట్టారు. అనివార్య పరిస్థితుల్లో కార్మికులు తమ హక్కుల కోసం ఆ రోజు నుండి నిరవధిక నిరసన ఆందోళన కార్యక్రమాలు చేయడానికి శోదా యాజమాన్యం ది పూర్తి బాధ్యత దీని నుండి తప్పించుకోవడం కోసం శోదా యాజమాన్యం అనేక కట్టు కథలు నేడు అల్లుతున్నారు శోదా యాజమాన్యం కార్మిక వ్యతిరేక,చట్టవ్యతిరేక చర్యలను మానుకొని పారిశ్రామికశాంతికై చర్చలకు ముందుకువచ్చి కార్మిక చట్టాలను అమలుచేయాలని జేఎసి కోరుతున్నది. నిరసన ఆందోళన కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారనే కారణంతో నలుగురు జేఏసీ నాయకులను ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లు నోటీస్ బోర్డ్ లో టర్మినేషన్ లెటర్లు పెట్టడం సరైన పద్ధతి కాదని ఇది కార్మిక చట్టాలకు వ్యతిరేకమైన చర్య అని వెంటనే ఆ లెటర్లను ఉపసంహరించుకోవాలని కోరారు

ఎల్ నినో వల్ల రాష్ట్రంలో కరెంటు సమస్య,నీటి సమస్యలు తీవ్రంగా ఉండబోతాయని అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నారు.బొగ్గుఉత్పత్తిని నిరాటంకంగా చేపట్టి టార్గెట్ ను పూర్తిచేయాలని సింగరేణి అధికారులు రేయంబవళ్ళు కృషిచేస్తున్నారు.శోదా కంపెనీలో మాత్రం చట్టంనిర్దేశించిన విధంగా కార్మికులకు జీతాలు, బత్యాలు సౌకర్యాలు అమలు చేయకుండా మెస్సులో సరయిన ఆహారo పెట్టకుండా శ్రమదోపిడికి పాల్పడుతు కార్మికులను భయబ్రాంతులకు గురిచేసేందుకు చట్టవ్యతిరేకంగా పనులు బందు చేయడం అక్రమైనది.సోదాకంపెనీ యాజమాన్య చర్యలు చట్టవ్యతిరేక,కార్మికవ్యతిరేకమైనవే కాకుండా ప్రజాప్రయోజనాలకు ఎంతోనష్టకరమైనది.న్యాయమైన సమస్యలపై కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమం ఉధృతరూపం తీసుకొనకముందే ప్రభుత్వం,సింగరేణి యాజమాన్యం,కేంద్ర కార్మికశాఖ వెంటనే జోక్యం చేసుకొని సోదా కంపెనీలో కార్మిక చట్టాలను అమలుచేయించాలని డిమాండ్ చేస్తున్నాం.

సోదా కంపెనీ కార్మికులు చేస్తున్నది ఆకలి పోరాటo.అని ఈ ఉద్యమానికి రాజకీయ పార్టీలన్నీ సింగరేణిలో అన్నీ కార్మిక సంఘాలు అండగా ఉండాలని అన్నారు కార్మిక చట్టాలను శోదా కంపెనీలో అమలు చేయించడంలో తోడ్పాటు ఇవ్వాలని

విజ్ఞప్తి చేశారు,


ఈరోజు నిరసన ఆందోళన దీక్షలను సందర్శించిన వారు

ఏఐటీయూసీ కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ సెక్రటరీ జె గట్టయ్య జి వీరస్వామి

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం ఆమర్లపూడి రాము జా టోత్ కృష్ణ బి ధర్మ ఎం చంద్రశేఖర్

జై భీమ్ పార్టీ నుండి యేర్ర కామేష్

పెనగడప గ్రామపంచాయతీ సర్పంచ్ సీతారాములు

సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు మన్నె వెంకన్న సిపిఐ పెనగడప పంచాయతీ కార్యదర్శి సుధాకర్ సిపిఐ నాయకులు సలిగంటి శ్రీనివాస్ తాజుద్దీన్ తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంపూర్ణ మద్దతును తెలియజేయడం జరిగింది

ఈ యొక్క కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ మార్షల్ శ్రీను కో కన్వీనర్ జెట్టి మోహన్ భూక్య మోహన్ ఎన్ సంజీవ్ జి వెంకటేశ్వర్లు ఎస్ అశోక్ జీ రఘు పి ఎల్ సురేష్ ఏ నాగయ్య ప్రమోద్ ఎస్.కె హైమద్ ఎస్ కే పాషా పి బాచిరెడ్డి కే కోటి ఎం చంద్రశేఖర్ బి రమేష్ బి రవి గౌడ్ వి కోటేశ్వరరావు బి రవి టి రామచందర్ తదితర నాయకులు పాల్గొన్నారు

చర్చలు

ఈరోజు ఆరు రోజులుగా విధులు బహిష్కరించి నిరసన ఆందోళన దీక్ష చేస్తున్న కార్మికుల వద్దకు సింగరేణి ఉన్నంత అధికారులు so to gm గోవిందరావు గారు వీకే సీఎం ప్రాజెక్ట్ ఆఫీసర్ శంకర్ గారు డివైజియం పర్సనల్ తిరుపతి గారు జేఏసీ నాయకత్వం తోటి దీక్ష శిబిరం వద్ద చర్చలు జరిపినారు ఈ చర్చలు విఫలమైనాయి తిరిగి రేపు ఉదయం 11 గంటలకు రుద్రంపూర్ జిఎం ఆఫీస్ నందు చర్చలు సింగరేణి యాజమాన్యం సోదా యాజమాన్యం జేఏసీ నాయకులతో ఉంటాయని తెలియజేస్తున్నాం

ఇట్లు

వి కే సి ఎం కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసి.

కొత్తగూడెం ఏరియా

Latest News

Read More...
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm

హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.
హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.

24-11-2026 05:04 pm