ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం - విదేశీ శక్తుల కుట్రలను తిప్పికొడదాం బండి విజయ్ భాస్కర్

నేటి చర్చ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం - విదేశీ శక్తుల కుట్రలను తిప్పికొడదాం బండి విజయ్ భాస్కర్
సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో మేధావులతో సంగోష్ఠి
కొత్తగూడెం: సూర్య ప్యాలెస్ లో ఈరోజు సాయంత్రం సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో మేధావులతో సంగోష్ఠి - A Dialogue With Eminent Citizens ఘనంగా జరిగింది.
ఈ సమావేశంలో ప్రధానంగా SIR పై జరుగుతున్న ఉద్యమాల వెనకాల ఉన్న అసలు నిజాలు బయటపెట్టారు.
SIR వెనక - విదేశీ శక్తుల హస్తం
ఈ సందర్భంగా కొత్తగూడెం జాతీయవాది *బండి విజయభాస్కర్* గారు మాట్లాడుతూ - సంచలన విషయాలు వెల్లడించారు.
SIR పై జరుగుతున్న ఉద్యమాలు - అమాయకంగా జరుగుతున్నవి కావు! వీటి వెనకాల జార్జ్ సోరోస్, ప్రోగ్రెసివ్ అలయన్స్, ఎలాన్ మస్క్ లాంటి వారి పరోక్ష ప్రమేయం ఉందని ఆయన స్పష్టంగా చెప్పారు.
విదేశీ డబ్బుతో, విదేశీ ప్రోత్బలంతో - భారతదేశంలో అస్థిరత సృష్టించాలని కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు.
మోడీ అడ్డుగా నిలబడ్డారు - అందుకే ఈ కుట్ర
అమెరికా - భారతదేశంలో బలవంతంగా తమ వ్యవసాయ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని చూస్తే - ప్రధాని నరేంద్ర మోడీ గారు అడ్డుగా నిలబడ్డారు
మన రైతులను కాపాడటం కోసం - మోడీ గారు అమెరికాకు తలొగ్గలేదు
అదేవిధంగా - రష్యా నుంచి పెట్రోల్ ని కొనవద్దని అమెరికా చెప్పినా - వినకుండా - మన దేశ ప్రయోజనాల కోసం రష్యా నుంచి పెట్రోల్ కొన్నారు
దీనివల్ల దేశాన్ని స్థిరపరచాలని, మోడీ గారిని దెబ్బతీయాలని - విదేశీ శక్తుల ప్రోత్బలంతో ఈ ఉద్యమాలు జరుగుతున్నాయని బండి విజయభాస్కర్ గారు వివరించారు.
జాతీయవాదుల పైనే బాధ్యత
ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత జాతీయవాదుల పైనే ఉందని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజల మధ్యకు వెళ్ళి - జాతీయవాదులు చర్చ పెట్టి - ప్రతి వాస్తవాన్ని తెలియజేయాలని - ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆయన కోరారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం - అరాచక శక్తులను తరిమికొడదాం - అనే నినాదంతో ఈ సమావేశం ముగిసింది.
