అప్పారావుపేట సమీపంలో 9 కిలోల చుక్కల జింక మాంసం అక్రమ రవాణా – ఒక వ్యక్తి అరెస్ట్

Views :0
అప్పారావుపేట సమీపంలో 9 కిలోల చుక్కల జింక మాంసం అక్రమ రవాణా – ఒక వ్యక్తి అరెస్ట్

అప్పారావుపేట సమీపంలో 9 కిలోల చుక్కల జింక మాంసం అక్రమ రవాణా – ఒక వ్యక్తి అరెస్ట్

నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట అటవీ శాఖ పరిధిలో వన్యప్రాణుల వేట, మాంసం అక్రమ రవాణా మరియు విక్రయాలపై అటవీ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో, 13-11-2026 తేదీన రాత్రి సుమారు 7.00 గంటల సమయంలో అప్పారావుపేట గ్రామ సమీపంలో ఒక వ్యక్తి యాక్టివా ద్విచక్ర వాహనంపై సుమారు 9 కిలోల చుక్కల జింక (Spotted Deer – Axis axis) మాంసాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా అటవీ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి సుమారు 9 కిలోల జింక మాంసాన్ని మరియు సంబంధిత వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సదరు వ్యక్తిని విచారించగా, సాయి అనే వ్యక్తి తనకు వన్యప్రాణి మాంసాన్ని విక్రయించడానికి ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడించాడు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం కేసు నమోదు చేసి, మాంసం సరఫరా చేసిన వ్యక్తితో పాటు ఇతర సంబంధిత వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నిందితుడిని గౌరవనీయ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, కొత్తగూడెం వారి ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం 15 రోజుల రిమాండ్ విధించింది.

అనంతరం నిందితుడిని సత్తుపల్లి సబ్ జైలుకు తరలించారు.

ఈ ఆపరేషన్‌లో K. Sreenu, Forest Range Officer, Dammapeta; Jayaram, DyRO; Ramarao, FBO; Base Camp సిబ్బంది Nandu, Venkatesh, Vamshy మరియు Rambabu పాల్గొన్నారు.

చుక్కల జింక (Spotted Deer – Axis axis) వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972లోని షెడ్యూల్-II కింద రక్షణ పొందుతున్న వన్యప్రాణి జాతి. వీటిని వేటాడటం, చంపడం, వాటి మాంసాన్ని అక్రమంగా కలిగి ఉండటం, రవాణా చేయడం లేదా విక్రయించడం చట్టప్రకారం శిక్షార్హమైన నేరాలు. అటువంటి నేరాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి.

వన్యప్రాణుల సంరక్షణకు ప్రజలు అటవీ శాఖకు సహకరించాలని, ఇలాంటి అక్రమ కార్యకలాపాల సమాచారం ఉంటే వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరడమైనది.

అటవీ శాఖ

దమ్మపేట రేంజ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

Latest News

Read More...
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm

హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.
హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.

24-11-2026 05:04 pm