ఇక ఇంటి వద్దకే మీసేవా.. ఒక్క ఫోన్‌కాల్‌తో మీసేవ డోర్‌స్టెప్ డెలివరీ.

ఇక ఇంటి వద్దకే మీసేవా.. ఒక్క ఫోన్‌కాల్‌తో మీసేవ డోర్‌స్టెప్ డెలివరీ.
నేటి చర్చ : తెలంగాణ, 13 నవంబర్, ▶ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తెలంగాణ ప్రభుత్వం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది..
మీసేవ డోర్‌స్టెప్ డెలివరీ పేరుతో పలు పౌర సేవలను నేరుగా ప్రజల ఇంటి వద్దకే అందిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, ఉద్యోగులు, ఇతర పనులతో బిజీగా ఉండేవారికి ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
1100కు కాల్ చేస్తే చాలు.
ఇంటి వద్దకే మీ సేవలను పొందాలనుకునేవారు టోల్‌ఫ్రీ నంబర్ 1100కు ఫోన్ చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తమకు అవసరమైన సేవ వివరాలను కస్టమర్ కేర్ ప్రతినిధికి తెలియజేయాలి. అనంతరం అవసరమైన పత్రాల వివరాలు, సేవకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసుకోవాలి.
ఈ ఐదు దశల్లో సేవలు మీ ఇంటికి
1. మీ సేవ టోల్‌ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయాలి.
2. అవసరమైన సేవ వివరాలను కస్టమర్ కేర్ ప్రతినిధికి తెలియజేయాలి.
3. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి.
4. మీ వివరాలను నమోదు చేసి అనువైన తేదీ, సమయాన్ని బుక్ చేసుకోవాలి.
5. నిర్ణయించిన సమయంలో మీ సేవ ప్రతినిధి ఇంటికి వచ్చి అవసరమైన సేవను అందిస్తారు.
ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయంటే?
ఈ డోర్‌స్టెప్ విధానంలో కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు. వీటితో పాటు ఆధార్ నమోదు, రేషన్ కార్డుకు సంబంధించిన పనులు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) కాపీలు, ఎంపిక చేసిన పోలీస్, రిజిస్ట్రేషన్ శాఖ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
