బేతుపల్లి చెరువులో గల్లంతైన 11 మంది సిబ్బంది సురక్షితం.
Views :0

బేతుపల్లి చెరువులో గల్లంతైన 11 మంది సిబ్బంది సురక్షితం.
నీటి చర్చ : సత్తుపల్లి, బేతపల్లి చెరువులో నిన్న సహాయక చర్యల్లో భాగంగా రెండు బోట్లలో 11 మంది ఎస్డిఆర్ఎఫ్ పోలీసులు చెరువుల్లో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడడానికి వెళ్లి గల్లంతైనట్టు తెలిసింది.
గల్లంతయినటువంటి 11మంది ఎస్డిఆర్ఎఫ్ పోలీసులు సురక్షితంగా ఓడ్డుకు చేరుకున్నట్టు వారిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సంఘటనా స్థలానికి కలెక్టర్ తో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరుకొని ప్రమాదం గురించి తెలుసుకొని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిని వెతుక్కుంటూ ఇతర ఎస్డిఆర్ఎఫ్ పోలీస్ సిబ్బంది వెళ్లి వాళ్లను సురక్షితంగా ఓడ్డుకు చేర్చడం జరిగింది.
అందరూ సురక్షితంగా ఉండడంతో అటు పోలీస్ శాఖ ఇటు ప్రభుత్వం మరియు పోలీసుల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశారు.
