తల్లీకూతుళ్లు అదృశ్యం,జీతం తీసుకొస్తానని వెళ్లి తిరిగిరాని వైనం.
Views :0

తల్లీకూతుళ్లు అదృశ్యం,జీతం తీసుకొస్తానని వెళ్లి తిరిగిరాని వైనం.
నేటి చర్చ : నాగోల్, 13 నవంబర్, హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన
జైపురి కాలనీలో సంపంగి సురేష్ తన భార్య సంపంగి సుగుణ(35), కుమార్తె నందిని(7) కలిసి నివాసం ఉంటున్నారు
ఈ నెల 6న ఉదయం 8:30 గంటలకు తాను పని చేస్తున్న ఇళ్లలో జీతం తీసుకొస్తానని భర్తకు చెప్పి.. కూతురితో కలిసి సుగుణ వెళ్లింది
అయితే.. ఎంతసేపటికీ తల్లీకూతుళ్లు ఇంటికి తిరిగి రాకపోవడంతో.. వారి కోసం గాలించిన కుటుంబ సభ్యులు
ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించిన భర్త సురేష్
కేసు నమోదు చేసి.. అదృశ్యమైన తల్లీకూతుళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.
