సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే వైద్య సేవలు ఇంత దయనీయమా?
Views :0

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే వైద్య సేవలు ఇంత దయనీయమా?
నేటి చర్చ : కొడంగల్, కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి మృతి చెందితే, కనీసం మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ కూడా దొరకని దుస్థితి, మృతుడు దుద్యాల మండలం ఆలేడు గ్రామానికి చెందిన మోర రాములు (35). పురుగుల మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన రాములును కొడంగల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో పరిగికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో అతను మృతి చెందాడు.
అంబులెన్స్ కావాలని వేడుకున్న బాధిత కుటుంబానికి వైద్యాధికారి నిర్లక్ష్యపు సమాధానం.చివరకు ట్రాక్టర్‌లో మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిన దౌర్భాగ్యం.
ప్రజలకు వైద్యం అందించలేని, మృతదేహానికి గౌరవం ఇవ్వలేని వ్యవస్థ ఎవరి కోసం ఆనీ ప్రజలు అడుగుతున్నారు.
