నేటి చర్చ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మురసు తుఫాను నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

Views :0
నేటి చర్చ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మురసు తుఫాను నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

తుఫాను నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి

ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు నేటి చర్చ: భద్రాచలం కొత్తగూడెం జిల్లా,

మురసు తుఫాను ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వర్షపాత పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర సహాయక చర్యలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణ హెచ్చరికలు, వర్షపాత తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు, జీపీవోలు, పంచాయతీ కార్యదర్శులు విధిగా తమ ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రామాలు, మున్సిపల్ ప్రాంతాల్లో టాంటాం ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేయాలని సూచించారు.

శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి, అందులో నివసిస్తున్న వారిని అవసరమైన మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పాత, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాల పరిస్థితులను పరిశీలించి విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు, డ్రైనేజీలు, ఓపెన్ నాలాలను నిరంతరం పర్యవేక్షిస్తూ నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు.

ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాత వంతెనలు, కల్వర్టులు, ప్రమాదకర రహదారులను పరిశీలించాలని ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన 94 ప్రమాదకర రహదారుల వద్ద అవసరమైన చోట ముందస్తుగా బారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. వాగులు, వంకలు పొంగి ప్రవహించే ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నియంత్రించాలని, చేపల వేట, పర్యాటక కార్యకలాపాలకు అనుమతించవద్దని అటవీ శాఖ అధికారులకు సూచించారు. మైనింగ్ కార్యకలాపాలపై కూడా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.

ప్రజల సహాయార్థం 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు

భారీ వర్షాలు, తుఫాను ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణ సహాయం అందించేందుకు కొత్తగూడెంలోని ఐడీఓసీ కార్యాలయం, గది నంబర్ ఎఫ్-28లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు అత్యవసర సమాచారం, వర్షాలు, వరదల కారణంగా ఎదురయ్యే సమస్యలను *కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు 08744-241950, 9392919743* ద్వారా తెలియజేయాలని సూచించారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటూ ఫిర్యాదులను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేసి, సంబంధిత శాఖలకు వెంటనే తెలియజేసి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అలాగే ప్రతి తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, ప్రజల నుంచి వచ్చే సమాచారంపై తక్షణమే స్పందించాలని సూచించారు. అధికారులు విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు ప్రాధాన్యతనిస్తూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

టెలికాన్ఫరెన్స్‌లో మండలాల వారీగా వర్షపాత పరిస్థితులను అధికారులు వివరించారు. చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, పినపాక మండలాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తుండగా, అశ్వారావుపేటలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు మున్సిపాలిటీల్లో సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేసి పారిశుద్ధ్య, డ్రైనేజీ నిర్వహణ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm