SIR దేశానికి ముఖ్యం, SIR పై రాజకీయాలు వద్దు, ప్రతి ఒక్కరు తమ ఓటును నమోదు చేసుకోవాలి దేశ ఆభివృద్ధిలో పాలు పంచుకోవాలి - సాగర్ బండారి.

SIR దేశానికి ముఖ్యం, SIR పై రాజకీయాలు వద్దు, ప్రతి ఒక్కరు తమ ఓటును నమోదు చేసుకోవాలి దేశ ఆభివృద్ధిలో పాలు పంచుకోవాలి - సాగర్ బండారి.
సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో మేధావులతో సంగోష్ఠి.
నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 13 నవంబర్, కొత్తగూడెం సూర్య ప్యాలెస్ లో ఈరోజు సాయంత్రం సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో *"మేధావులతో సంగోష్ఠి - A Dialogue With Eminent Citizens"* ఘనంగా జరిగింది.
ఈ సమావేశంలో ప్రధానంగా SIR ఎందుకు ,SIR పై కుట్రలు, ఓటర్ లిస్ట్ కష్టాలు ఏంటి అనేదానిపై చర్చించడం జరిగింది.
గత 20 సంవత్సరాలుగా ఓటర్ లిస్టు నుండి డెత్,షిఫ్ట్, డూప్లికేట్, డబల్ ఓట్లను తీసివేయకపోవడంతో ఎలక్షన్ సమయాల్లో బూత్ ఏజెంట్లకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని, SIR ద్వారా ఓటర్ లిస్టు ప్రక్షాళన జరిగి ఎలక్షన్ సమయాల్లో బూత్ ఏజెంట్లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.
SIR వెనక - విదేశీ శక్తుల హస్తం!
SIR పై జరుగుతున్న ఉద్యమాలు - అమాయకంగా జరుగుతున్నవి కావు! వీటి వెనకాల విదేశీ శక్తుల కుట్ర ఉందని స్పష్టంగా చెప్పడం జరిగింది .
విదేశీ డబ్బుతో, విదేశీ ప్రోత్బలంతో - భారతదేశంలో అస్థిరత సృష్టించాలని కుట్ర జరుగుతుందని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి విదేశీ శక్తులతో కలిసి స్వదేశీ ఇండికూటమి కుట్రలు చేస్తుందని చెప్పడం జరిగింది.
మోడీ అడ్డుగా నిలబడ్డారు - అందుకే ఈ కుట్ర!
యువత దేశ రాజకీయాలే కాకుండా అంతర్జాతీయ రాజకీయాల కోసం తెలుసుకోవాలని మన దేశంపై ఇతర దేశాలు చేసే కుట్రలను తెలుసుకోవాలని కోరడం జరిగింది.
చాణక్యుడు చెప్పినటువంటి ఒక వాక్యం : రాజ్యాన్ని రాజు గొప్పగా పాలించినప్పుడు ద్రోహులంతా ఏకమైతారని, అదే ఇప్పుడు భారతదేశంలో జరుగుతుందని, అవే ఇండికూటమి రూపంలో జరిగే కుట్రలు అని తెలియజేయడం జరిగింది.
జాతీయవాదుల పైనే బాధ్యత!
ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత జాతీయవాదుల పైనే ఉందని.
ప్రజల మధ్యకు వెళ్ళి - జాతీయవాదులు చర్చ పెట్టి, ప్రతి వాస్తవాన్ని తెలియజేయాలని, ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరడం జరిగింది.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, అరాచక శక్తులను తరిమికొడదాం.
