తెలంగాణ పోలీస్ శాఖలో పెండింగ్ ప్రమోషన్లకు ఎట్టకేలకు పరిష్కారం.,అధికారులకు భారీ ఊరట.

Views :0
తెలంగాణ పోలీస్ శాఖలో పెండింగ్ ప్రమోషన్లకు ఎట్టకేలకు పరిష్కారం.,అధికారులకు భారీ ఊరట.

తెలంగాణ పోలీస్ శాఖలో పెండింగ్ ప్రమోషన్లకు ఎట్టకేలకు పరిష్కారం.,అధికారులకు భారీ ఊరట!.

తెలంగాణ పోలీస్ శాఖలో 1991, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన డీఎస్పీ, అదనపు ఎస్పీ అధికారుల దీర్ఘకాలిక పదోన్నతుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. దీంతో ఏళ్ల తరబడి ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న అధికారులకు భారీ ఊరట కలగనుంది.

ఈ సమస్య పరిష్కారం కోసం గతంలో అధికారులతో సమావేశమైన ఉన్నతాధికారులు.. పదోన్నతుల్లో ఉన్న సాంకేతిక, న్యాయపరమైన చిక్కులను వివరించి, సామరస్యపూర్వక పరిష్కారానికి సహకరించాలని కోరారు. దీనికి స్పందించిన అధికారులు తమ కోర్టు కేసులను ఉపసంహరించుకున్నారు. డీజీపీ నిర్ణయాలపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ, ప్రతికూల నిర్ణయాలు వచ్చినా న్యాయపరమైన చర్యలకు వెళ్లబోమని అఫిడవిట్లు సమర్పించారు.

డీజీపీ కార్యాలయం, ఐజీ (పర్సనల్)తో కూడిన కమిటీ గత కొన్ని నెలలుగా సీనియారిటీ జాబితాలు, ఖాళీలు, సీనియారిటీ సమస్యలు, ప్రభుత్వ ఉత్తర్వులు, పెండింగ్ కోర్టు కేసులను సమగ్రంగా పరిశీలించింది.

తాజాగా నిర్వహించిన సమావేశంలో కమిటీ సిఫార్సులను అధికారుల ముందు ఉంచారు. అందుబాటులో ఉన్న ఖాళీలతో పాటు ప్రతి అధికారికి ఏ ర్యాంకులో, ఏ తేదీ నుంచి పదోన్నతి కల్పించాలనే ప్రతిపాదనలను తొలిసారిగా వ్యక్తిగతంగా వివరించారు. ఈ సిఫార్సులన్నింటికీ అధికారులు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు.

ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు నివేదించిన అనంతరం దశలవారీగా పదోన్నతుల ప్రక్రియ చేపట్టనున్నారు. తొలుత 1991 బ్యాచ్ అధికారులకు ప్రమోషన్లు కల్పించనున్నారు.

ఈ సమస్యకు పరిష్కారం లభించకపోతే పలువురు అధికారులు పదోన్నతులు పొందకుండానే ప్రస్తుత హోదాల్లో పదవీ విరమణ చేసే పరిస్థితి ఉండేదని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అధికారుల సహకారం, కమిటీ కృషితో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ప్రమోషన్ల వివాదానికి తెరపడనుంది.

Latest News

Read More...
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm

హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.
హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.

24-11-2026 05:04 pm