జూదం వ్యసనంగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దు.. జూదానికి దూరంగా ఉండి మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి: జిల్లా ఎస్పీ.

జూదం వ్యసనంగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దు.. జూదానికి దూరంగా ఉండి మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి: జిల్లా ఎస్పీ.
నేటి చర్చ : కామారెడ్డి, మద్నూర్‌లో పేకాట స్థావరంపై ఎస్సై మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల దాడి.. 9 మంది పట్టివేత
- విశ్వసనీయ సమాచారం మేరకు మద్నూర్ గ్రామంలోని ఎస్సై మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల దాడి.
- పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు.
- రూ.84,700 నగదు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ: జూదం వ్యసనంగా మారి విలువైన సమయాన్ని వృథా చేసుకోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలకు గురికావద్దని సూచించారు. జూదంలో ఆర్థిక నష్టాలే మిగులుతాయని, ఎప్పటికైనా ఓటమి తప్పదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని తెలిపారు. ఆశతో జూదం ఆడుతూ కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోయి జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దని హెచ్చరించారు.
జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు యువత, ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. విద్య, ఉపాధి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి సానుకూల మార్గాలపై దృష్టి సారించి తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని తెలిపారు. మంచి మార్గంలో అడుగులు వేస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించి, తమ కుటుంబాలకు గర్వకారణంగా నిలుస్తూ మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని పిలుపునిచ్చారు.
జిల్లావ్యాప్తంగా జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు. ప్రజలు జూదానికి దూరంగా ఉంటూ బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.
