గౌతంపూర్ గ్రామపంచాయతీలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని ప్రజవాణి లొ వినతిపత్రం -సోప్పరి క్రాంతి ముదిరాజ్, బీజేపీ జిల్లా నాయకులు.

Views :0
గౌతంపూర్ గ్రామపంచాయతీలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని ప్రజవాణి లొ వినతిపత్రం -సోప్పరి క్రాంతి ముదిరాజ్, బీజేపీ జిల్లా నాయకులు.
Soppari Kranthi Mudhiraj

గౌతంపూర్ గ్రామపంచాయతీలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని ప్రజవాణి లొ వినతిపత్రం -సోప్పరి క్రాంతి ముదిరాజ్, బీజేపీ జిల్లా నాయకులు.


నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,16 నవంబర్, సోమవారం గ్రివెన్స్ డే సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది , చుంచుపల్లి మండల పరిధిలోని గౌతంపూర్ గ్రామపంచాయతీలో ఆసరా పెన్షన్ల కోసం 100కు పైగా దరఖాస్తులు సమర్పించినప్పటికీ, కేవలం 15 మందికి మాత్రమే పెన్షన్లు మంజూరు చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాము.

ముఖ్యంగా సదరం సర్టిఫికెట్లలో 80 నుంచి 100 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు సైతం పెన్షన్లు మంజూరు కాకపోవడం చాలా బాధాకరం. తీవ్ర వైకల్యంతో జీవనం సాగిస్తున్న వారు పెన్షన్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, వారికి పెన్షన్ అందకపోవడం అన్యాయం.

అర్హులైన దరఖాస్తుదారులకు ఏదో ఒక సాకు చూపిస్తూ పెన్షన్లు మంజూరు చేయకుండా ఉండటం సరైన విధానం కాదు. ప్రతి దరఖాస్తును పారదర్శకంగా పరిశీలించి, అర్హత కలిగిన వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

కావున మా ప్రధాన విజ్ఞప్తులు:

1. గౌతంపూర్ గ్రామపంచాయతీలో వచ్చిన 100కు పైగా దరఖాస్తులను మరోసారి సమగ్రంగా పరిశీలించాలి.

2. 80 నుంచి 100 శాతం వైకల్యం ఉన్న సదరం సర్టిఫికెట్‌దారులకు అర్హత నిబంధనల ప్రకారం పెన్షన్లు మంజూరు చేయాలి.

3. పెన్షన్లు మంజూరు కాని దరఖాస్తులకు గల కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలి.

4. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పెన్షన్ అందేలా తగిన చర్యలు తీసుకోవాలి.

పేదలు, వృద్ధులు, దివ్యాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యపై తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాము.

Latest News

Read More...
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm

హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.
హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.

24-11-2026 05:04 pm