భద్రాచలం లాడ్జిలో గది కావాలని అడిగినందుకు దాడికి పాల్పడి, వ్యక్తి మృతికి కారణమైన ఇద్దరు నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు

Views :0
భద్రాచలం లాడ్జిలో గది కావాలని అడిగినందుకు దాడికి పాల్పడి, వ్యక్తి మృతికి కారణమైన ఇద్దరు నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు

భద్రాచలం లాడ్జిలో గది కావాలని అడిగినందుకు దాడికి పాల్పడి, వ్యక్తి మృతికి కారణమైన ఇద్దరు నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు నేటి చర్చ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎస్పీ కార్యాలయం, 20 నవంబర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం పట్టణంలో లాడ్జిలో గది కావాలని అడిగిన వ్యక్తులపై దాడికి పాల్పడి, తెల్లం శరత్ బాబు మృతికి కారణమైన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 16.11.2026వ తేదీన మృతుడు తెల్లం శరత్ బాబు వద్దకు అతని స్నేహితులు మరియు బంధువులైన కుర్సం నాగప్రశాంత్, కీసర కార్తీక్‌లు కలిసేందుకు భద్రాచలం వచ్చారు. వారు రాత్రి బస చేసేందుకు గది కోసం వెతుకుతూ, అదే రోజు రాత్రి సుమారు 10:00 గంటల సమయంలో భద్రాచలం రామాలయం సమీపంలోని సత్యసాయి లాడ్జికి వెళ్లి గది కావాలని అడిగారు.

ఈ క్రమంలో లాడ్జి యజమాని ద్వార మణికంఠ మరియు లాడ్జి బాయ్ బర్ల వినయ్‌లు గది కేటాయింపు విషయంలో సదరు ముగ్గురు వ్యక్తులతో వాగ్వాదానికి దిగి, వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తెల్లం శరత్ బాబు తీవ్రంగా గాయపడి, రోడ్డుపై స్పృహ కోల్పోయి పడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఈ ఘటనపై మృతుడి తండ్రి తెల్లం రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితులైన ద్వార మణికంఠ మరియు బర్ల వినయ్‌లను 20.11.2026వ తేదీన భద్రాచలం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రాచలం పట్టణ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటాము.

Latest News

Read More...
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm

హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.
హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.

24-11-2026 05:04 pm