ఆర్మీ క్యాంటీన్ లిక్కర్ అక్రమ దందా... భర్తలు తెస్తే, భార్యలు అమ్మేశారు.

Views :0
ఆర్మీ క్యాంటీన్ లిక్కర్ అక్రమ దందా... భర్తలు తెస్తే, భార్యలు అమ్మేశారు.
Army liquor illegal business

ఆర్మీ క్యాంటీన్ లిక్కర్ అక్రమ దందా... భర్తలు తెస్తే, భార్యలు అమ్మేశారు.

నేటి చర్చ : హైదరాబాద్‌లోని అల్వాల్ పరిధిలో సబ్సిడీపై వచ్చే డిఫెన్స్ మద్యాన్ని (క్యాంటీన్ కోటా) అక్రమంగా విక్రయిస్తున్న వారిపై ఎక్సైజ్ అధికారులు కొరడా ఝుళిపించారు. రెండు వేర్వేరు దాడుల్లో రూ. 2.11 లక్షల విలువైన 163 డిఫెన్స్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

ఏం జరిగిందంటే..

మాజీ సైనికోద్యోగులైన తమ భర్తల ద్వారా ఆర్మీ క్యాంటీన్ల నుంచి తక్కువ ధరకు మద్యం తీసుకొచ్చి, వాటిని తమ ఇళ్ల నుంచే బయటి వ్యక్తులకు విక్రయిస్తూ ఈ అక్రమ దందాకు తెరలేపారు.

కేసు 1: లోతుకుంట సరస్వతి నగర్‌లో నివాసం ఉంటున్న మాన్యం నాగప్రసన్న, ఆమె భర్త రామ్ ఆంజనేయులు ఇంట్లో సోదాలు చేసిన మల్కాజిగిరి ఎక్సైజ్ టీమ్.. 96 లిక్కర్ బాటిళ్లను సీజ్ చేసింది. భర్త క్యాంటీన్ నుంచి మద్యం తీసుకురాగా, భార్య ఇంట్లో నుంచి అమ్మకాలు సాగిస్తున్నట్లు గుర్తించి నాగప్రసన్నను అరెస్ట్ చేశారు.

కేసు 2: న్యూ బోయిన్‌పల్లి సౌజన్య కాలనీలో స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి ముసిమి లెంక (39) అనే మహిళను అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 67 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ రెండు కేసుల్లో నిందితులను అల్వాల్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి, అధికారులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

Read More...
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm

దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.
టాస్క్ ఫోర్స్ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.

25-11-2026 04:55 pm

ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm