టాస్క్ ఫోర్స్ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.

టాస్క్ ఫోర్స్ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.
నేటి చర్చ : రామగుండం, 25 నవంబర్, పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో,బెల్లంపల్లి బస్తీలో డబ్బులు పందెంగా పెట్టి అక్రమంగా పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి ఆకస్మికంగా దాడి నిర్వహించారు.
నార్కోటిక్ టీమ్/టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ దీకొండ రమేష్ మరియు సిబ్బంది దాడి నిర్వహించి, డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి ₹8,930 నగదు మరియు 4 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన నిందితుల వివరాలు:
1. దేవసాని సత్యనారాయణ,తండ్రి: శంకరయ్య, బెల్లంపల్లి బస్తీ, బెల్లంపల్లి.
2. తుల భరత్ కుమార్,తండ్రి: రాజేశం,8 ఇంక్లైన్ కాలనీ, గోదావరిఖని.
3. దాసరి నాగేష్, తండ్రి:రాజం, బెల్లంపల్లి.
4. అనపర్తి రాజలింగు, తండ్రి: మల్లయ్య, బెల్లంపల్లి.
పట్టుబడిన నలుగురు వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న ₹8,930 నగదు మరియు 4 సెల్‌ఫోన్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు.
అక్రమ జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
