చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
కుమారుడి భవిష్యత్తు కోసం ఎంతో ఆశతో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి సాగనంపారు.. కానీ విధి ఆ తల్లిదండ్రులను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. విషయం తెలిసిన కుమారుడు కన్నీరుమున్నీరవుతూ తిరుగు ప్రయాణమయ్యాడు.
నేటి చర్చ : జహీరాబాద్, 25 నవంబర్, జాహీరాబాద్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన శరణప్ప సిద్రామప్ప (61), సుష్మ (49) దంపతులు మృత్యువాతపడ్డారు.
తమ కుమారుడు వీర్ కుమార్‌ను చదువు కోసం నేపాల్‌కు పంపించేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లిన తల్లిదండ్రులు.. తిరుగు ప్రయాణంలో కోళ్ల డీసీఎంను కారు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు.
తల్లిదండ్రుల మరణవార్త తెలుసుకున్న కుమారుడు ఢిల్లీ నుంచి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు.
కుమారుడి భవిష్యత్తు కోసం ప్రయాణమైన ఆ తల్లిదండ్రులు.. చివరకు అతడికి తీరని జీవితకాల విషాదాన్ని మిగిల్చారు.
