భద్రాచలం డిఎస్పి ఆధ్వర్యంలో చెన్నాపురం, ఎర్రంపాడు గిరిజన గ్రామాల్లో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం – 100 మంది చిన్నారులకు దుస్తుల పంపిణీ.

Views :0
భద్రాచలం డిఎస్పి ఆధ్వర్యంలో చెన్నాపురం, ఎర్రంపాడు గిరిజన గ్రామాల్లో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం – 100 మంది చిన్నారులకు దుస్తుల పంపిణీ.
Clothes distributed to children by DSP Office Bhadrachalam

భద్రాచలం డిఎస్పి ఆధ్వర్యంలో చెన్నాపురం, ఎర్రంపాడు గిరిజన గ్రామాల్లో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం – 100 మంది చిన్నారులకు దుస్తుల పంపిణీ.

నేటి చర్చ : డీఎస్పీ కార్యాలయం, భద్రాచలం, తేదీ:31.10.2026, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు, భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో చర్ల మండల పరిధిలోని చెన్నాపురం, ఎర్రంపాడు గిరిజన గ్రామాల్లో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రెండు గ్రామాలకు చెందిన 100 మంది చిన్నారులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భద్రాచలం డీఎస్పీ గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన గ్రామాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, ప్రజలకు అవసరమైన సమయంలో పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలిపారు.

అనంతరం చిన్నారుల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించాలని, వారికి మెరుగైన విద్యను అందించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో చర్ల సీఐ రాజు వర్మ, ఎస్సై నర్సిరెడ్డి, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest News

Read More...
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm

దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.
టాస్క్ ఫోర్స్ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.

25-11-2026 04:55 pm

ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm