చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు – ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఐ రామకృష్ణ గౌడ్.

అన్నపూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు – ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఐ రామకృష్ణ గౌడ్.
నేటి చర్చ : జమ్మికుంట, 1 నవంబర్ 2026,జమ్మికుంట పట్టణంలోని బొమ్మలగుడి ఆవరణలో రేపు నిర్వహించనున్న బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ పరిశీలించారు. అన్నపూర్ణ సేవా సమితి సభ్యులతో కలిసి కార్యక్రమ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రేపు జరిగే ప్రవచన కార్యక్రమానికి భక్తులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ముఖ్య గమనిక: ఈ కార్యక్రమానికి ఎలాంటి పాస్‌ల అవసరం లేదు. ప్రతి ఒక్కరూ సమానులే. ఎలాంటి ప్రత్యేక పాస్‌లు లేదా ప్రాధాన్యతలు ఉండవు. భక్తులందరికీ సమాన అవకాశం కల్పించబడుతుంది.
కావున ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో హాజరై ఆధ్యాత్మిక ప్రవచనాలను వినాలని అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు.
